prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:06 pm Digital Edition : PRAJA VANI

కామ్రేడ్ల వర్ధంతికి రక్తదాన నివాళి

*కామ్రేడ్ల వర్ధంతికి రక్తదాన నివాళి*

*బండి నారాయణ–ధనమ్మ, లక్ష్మి వర్ధంతి సందర్భంగా సభ, రక్తదాన శిబిరం*

*తలసేమియా బాధిత చిన్నారుల కోసం సీపీఎం చిరుమర్రి గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ*

ముదిగొండ అక్టోబర్ 17 ప్రజావాణి

*తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలిచేందుకు సీపీఎం చిరుమర్రి గ్రామశాఖ ఆధ్వర్యంలో బండి రమేష్ నేతృత్వంలో బండి రమేష్ నివాస ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.కామ్రేడ్ బండి నారాయణ–ధనమ్మ, లక్ష్మి వర్ధంతి సందర్భంగా వర్ధంతి సభను నిర్వహించి, వారికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కామ్రేడ్ల ప్రజా ఉద్యమాలు, సమాజ సేవ, వారు అనుసరించిన ఆశయాలను స్మరించుకున్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ తలసేమియా బాధిత చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్ధంతి సభతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా కామ్రేడ్లకు సేవా కార్యక్రమాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, సీపీఎం మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు, సీనియర్ నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్,సీపీఎం మండల నాయకులు కోలేటి ఉపేందర్, సామినేని రామారావు, ముదిగొండ సర్పంచ్ కట్టకూరు ఉపేందర్, మల్లన్నపాలెం సర్పంచ్ కోలేటి వెంకటేశ్వర్లు, చిరుమర్రి సర్పంచ్ సామినేని రాంబాబు, సీఐటీయూ మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భద్రయ్య , బీఆర్‌ఎస్ నాయకులు మేడ ఎల్లారావు, గాలి రాము తదితరులు పాల్గొన్నారు.అలాగే బండి నారాయణ కుటుంబ సభ్యులు, సీపీఎం ముదిగొండ మండల, గ్రామశాఖ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*