prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 2:22 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కాక వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం: మద్దుల గోపాల్ రెడ్డి

ఎండపల్లి మండలంలోని రాజారంపల్లి గ్రామంలో దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, 1957 నుండి 2009 వరకు ప్రజా జీవితంలో కొనసాగిన వెంకటస్వామి ఎమ్మెల్యేగా, మంత్రిగా, 7 సార్లు ఎంపీగా విశేష సేవలందించారని కొనియాడారు. పేదలకు ఇళ్లు కల్పించి ‘గుడిసెల వెంకటస్వామి’గా పేరుగాంచారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.