వంగపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మారెళ్ళ భాస్కర్ రెడ్డి
మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి,
మండలంలోని వంగపల్లి గ్రామంలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కోమిరే రామస్వామి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి, చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంబించారు.ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఆర్దికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. అందుకోసం వరి ధాన్యం పండించిన ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఆయన రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ వెంకట్ నారాయణ,ఉప సర్పంచ్ బొంగోనీ సుజాత సాగర్, ఏ పి ఎం ప్రకాశం, సి సీ కనకచంద్రం, వి ఓ ఏ స్వర్ణలత,గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు గుడ్ల శ్రీలత, కార్యదర్శి కవిత, కోశాధికారి స్వరూప, హమాలీ కార్మికులు, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.