కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం
మద్దూరు అక్టోబర్5, ప్రజా వాణి,
ధూళిమిట్ట మండలం రెడ్యానాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ధరావత్ తిరుపతిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో,సిద్దిపేట డి సి సి అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఆదేశానుసారం జరిగిన కార్యక్రమంలో ధరావత్ తిరుపతిని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ అధ్యక్షులు ధరావత్ తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి, మండల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ధరావత్ తిరుపతి గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.