prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:28 pm Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాల పటిష్ట పరుస్తా

కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాల పటిష్ట పరుస్తా–

డివిజన్ 3 కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు ఎన్నిక.

జవహర్ నగర్ అక్టోబర్ 17 ( ప్రజావాణి ప్రతినిధి):

డివిజన్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జవహర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాల పటిష్టతకు పాటుపడతానని జవహర్ నగర్ డివిజన్ 3 కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ 3 జనరల్ సెక్రటరీగా సీనియర్ నాయకులు ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ 3 పూర్తిస్థాయి కమిటీ నియామకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లను జవహర్ నగర్ డివిజన్ 3 కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి మాజీ మేయర్ డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కొటేష్ గౌడుకు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో క్రమశిక్షణతో నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జవహర్ నగర్ డివిజన్ 3 పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బల్లి శ్రీనివాస్, కొలిపాక సాయికిరణ్, కన్నబోయిన రాజు యాదవ్, గండి సునీత, రేణుక, నాచారం కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.