prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 12:04 pm Digital Edition : PRAJA VANI

కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన

కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకం కింద అధిక సాంద్రత పత్తి సాగుపై అవగాహన

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

శుక్రవారం చండూరు మండలం కస్తాల గ్రామంలో కపాస్ కాంతి పథకంలో భాగంగా రైతులకు అధిక సాంద్రత పత్తి (HDPS) సాగుపై అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. మహేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. అధిక సాంద్రత విధానంలో దగ్గర దగ్గరగా విత్తడం వల్ల పత్తి పంట ఒకేసారి చేతికి వస్తుందని, పంట త్వరగా పూర్తయి అదే పొలంలో రెండో పంట వేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఎకరానికి 40 వేల మొక్కలు ఉంటాయని, ఇది సాధారణ పద్ధతి కంటే మూడు రెట్లు ఎక్కువని, దిగుబడి ఒకేసారి వస్తుందని వివరించారు. ప్రస్తుతం పత్తి పంట పెట్టకు గురైందని, రైతులు 2 శాతం యూరియా లేదా మల్టీకే వంటి పోషకాలను స్ప్రే చేసుకోవాలని సూచించారు. అలాగే వచ్చే యాసంగి లో బోర్ల కింద వరి వేయవద్దని, పెసర్లు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలు వేయడం మేలని సూచించారు. ఈ కార్యక్రమంలో కట్ట నరసింహ, రైతులు తదితరులు పాల్గొన్నారు.