కళాశాలలో ఆధ్యాత్మిక సందడి, విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ భజనలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన ను పెంపొందించే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గౌతమి కళాశాలలో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గాయకుడు అమిత్ నారాయణ్ బృందం ఉత్సాహభరితంగా నిర్వహిం చిన భజన కార్యక్రమం విద్యార్థినులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు గంటపాటు సాగిన ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాలను నింపింది. భక్తి గీతాల మధుర...