prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:44 am Digital Edition : PRAJA VANI

కళాశాలలో ఆధ్యాత్మిక సందడి, విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ భజనలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు, ఆధ్యాత్మిక చింతన ను పెంపొందించే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గౌతమి కళాశాలలో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ గాయకుడు అమిత్ నారాయణ్ బృందం ఉత్సాహభరితంగా నిర్వహిం చిన భజన కార్యక్రమం విద్యార్థినులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు గంటపాటు సాగిన ఈ ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాలను నింపింది. భక్తి గీతాల మధుర స్వరాలకు విద్యార్థినులు లయబద్ధంగా అడుగులు వేస్తూ, ఆటపాటలతో సందడి చేశారు. సంగీతం, భక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ కార్యక్ర మం ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. మానసిక ప్రశాంతతకు ధ్యానమే మార్గం ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం, భజనలు, సానుకూల ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం వివరించింది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రతికూల ఆలోచనలను విశ్లేషించి వాటిని అధిగమించడం, ధ్యానం ద్వారా మానసికస్థిరత్వాన్ని పెంపొందించు కోవడం వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవడంతో పాటు చదువులో మెరుగైన ఫలితాలు సాధిం చేందుకు అవసరమైన మానసిక ప్రశాంతతను పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల దైనందిన జీవితంలో ధ్యానం, సానుకూల దృక్పథాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం భజనలతో పాటు ఆధ్యాత్మిక సందేశాలను అందించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అం దించింది. చదువుతో పాటు మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికా సానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటి చెప్పింది.ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వా లంటీర్లు గుండ గోని జయశంకర్, పోగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.