prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 8:07 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కలసపాడు ఎన్నికల ప్రచారంలో జోరు.సూదా అనురాధ విజయానికి కృషి చేస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల రథసారథి దేవసాని ఆదిత్య రెడ్డి,

బద్వేల్ నియోజకవర్గం అక్టోబర్ 29 ప్రజావాణి  కలసపాడు మండలం కలసపాడు టౌన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సూదా అనురాధ గారి విజయమే లక్ష్యంగా, బద్వేల్ నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి, స్థానిక సమస్యల రథసారథి దేవసాని ఆదిత్య రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశీస్సులతో, కడప ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి, సహకారంతో, జిల్లా అధ్యక్షులు శ్రీ పి.రవీంద్రనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, సూదా అనురాధ కుటుంబం గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ ప్రజలకు అందించిన సేవలు, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ఎంతో విలువైనవని పేర్కొన్నారు. అనురాధ భర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సూదా రామకృష్ణారెడ్డి, రెండు పర్యాయాలు రాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా,ఒక పర్యాయం ఎంపీపీగా పనిచేసి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు.వారి కుటుంబానికి మండల ప్రజలతో ఉన్న అనుబంధం, ప్రజాసేవలో ఉన్న అనుభవం పార్టీకి బలమని తెలిపారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ, వారి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేసే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. అదేవిధంగా, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆదిత్య రెడ్డి గారు విమర్శలు గుప్పించారు. నామినేషన్ల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం, పోలీసులను అడ్డుపెట్టుకుని ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. కలసపాడు మండల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం అవసరమని పేర్కొంటూ, ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి జెడ్పీటీసీ అభ్యర్థి సూదా అనురాధ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దేవసాని ఆదిత్య రెడ్డి, విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.ప్రజలతో మమేకమై.. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.దేవసాని ఆదిత్య రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ విజయమే ధ్యేయంగా ముందడుగు! వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,