కరెంట్‌ కష్టాలు తీర్చకుంటే అసెంబ్లీ ముట్టడే

*కరెంట్‌ కష్టాలు తీర్చకుంటే అసెంబ్లీ ముట్టడే!* *విద్యుత్‌ కోతలతో ఎండిపోతున్న పంటలు* *ఆందోళనలో రైతన్నలు ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో గౌడిచర్ల రైతుల రాస్తారోకో* *ప్రజావాణిలో కలెక్టర్‌కు రైతు నాయకుల వినతిపత్రం* సంగారెడ్డి, అక్టోబర్‌ 12 (మన సమగ్ర ప్రజావాణి): ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు రోడ్డెక్కారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలతో పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గౌడిచర్ల గ్రామ రైతులు...