కరెంటు కోతలతో రైతులకు తిప్పలు
కరెంటు కోతలతో రైతులకు తిప్పలు మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 01 అందోల్: సంగారెడ్డి జిల్లా ప్రతినిధి వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు అప్రకటిత విద్యుత్ కోతలు మరింత గోస తెచ్చిపెడుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సరైన సమయంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులకు సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు....