prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:01 pm Digital Edition : PRAJA VANI

కరెంటు కోతలతో రైతులకు తిప్పలు

కరెంటు కోతలతో రైతులకు తిప్పలు

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 01 అందోల్: సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు అప్రకటిత విద్యుత్ కోతలు మరింత గోస తెచ్చిపెడుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. అందోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సరైన సమయంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.
ఆరుగాలం శ్రమించి, అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులకు సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కరెంటు కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి కోతలు లేని, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు చాపల వెంకటేశం, సార శ్రీధర్, కుమ్మరి క్రిష్ణ, ఖాజా పాష తదితరులు పాల్గొన్నారు.