prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:18 pm Digital Edition : PRAJA VANI

కరాటే మాస్టర్ కావాలి మహేష్ గౌడ్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘన సన్మానం

*కరాటే మాస్టర్ కావాలి మహేష్ గౌడ్‌కు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘన సన్మానం*

చిలప్ చెడ్. సెప్టెంబర్ 5
మన ప్రజావాణి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతరం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ కాలాలి మహేష్ గౌడ్ (తండ్రి: కలాలి దుర్గా గౌడ్) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని సోమవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కరాటే విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మహేష్ గౌడ్ మరిన్ని ఉన్నత విజయాలు సాధించి, నియోజకవర్గానికి అలాగే మెదక్ జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత, కరాటే మాస్టర్ కాలాలి మహేష్ గౌడ్ మరియు ఆయన తండ్రి కలాలి దుర్గా గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించిన కరాటే ప్రదర్శన పోటీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మందికి పైగా మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఏకకాలంలో పాల్గొని ప్రదర్శన ఇచ్చి ఈ గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పినట్లు తెలిపారు.
ఈ గొప్ప రికార్డు సాధించడానికి అకాడమీ ఫౌండర్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జామినర్, ఇంటర్నేషనల్ రెఫ్రీ, కిక్‌బాక్సింగ్ గ్రాండ్ మాస్టర్ ఎన్. పోచయ్య ఎంతగానో కృషి చేసి మార్గదర్శకత్వం వహించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంతరం గ్రామ సర్పంచ్ పంబాల భాగ్యలక్ష్మి బుర్రేశు, ఉప సర్పంచ్ యాదయ్య, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సామాన్య నాయక్, ఉపాధ్యక్షుడు నరహరి, ఊరి పెద్దలు కుమ్మరి యాదయ్యతో పాటు పలువురు మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.