కమలాపూర్ లో శాస్త్రవేత్తల క్షేత్ర పరిశీలన
పత్తి వరి పంటల పరిరక్షణకు కీలక సూచనలు
చీడ పీడలు తెగుళ్ల నివారణకు సలహాలు
ప్రజావాణి అక్టోబర్ 9 కమలాపూర్ మండల్ పంటలను ఆశిస్తున్న చీడపీడలు తెగుల నుంచి రక్షించేందుకు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు అనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గూడూరు కన్నూరు గ్రామాల్లో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం( RARS) శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తి వరి పంటలను పరిశీలించారు
పత్తిపై పచ్చ దోమ తెల్ల దోమ ప్రభావం
ప్రస్తుతం కాయ దశలో ఉన్న పత్తి పంటను పరిశీలించి శాస్త్రవేత్తలు పచ్చిదోమ తెల్ల దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు వీటి నివారణకు లీటర్ నీటికి డెఫిని 1.25 మి. లీ లేదా అల్ఫీడో ఫైరోఫెన్ 2 మి.లీ
కలిపి పిచికారి చేయాలని సూచించారు వీటితోపాటు 1500 పి పి యం వేప నూనె చొప్పున కలపాలని తెలిపారు
అధిక ఉష్ణోగ్రతతో పంటకు ఒత్తిడి
ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా పత్తి మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు లీటర్ నీటికి 19.19.19 నీటిలో కరిగే ఎరువును ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు
వరి గింజ మచ్చపై తెగుళ్ళపై అప్రమత్తం
గింజ గట్టి పడే దశలో ఉన్న వరి పంటను కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు దశల్లో పంటను ఆశించే గింజ మచ్చ తెగుళ్ళను నివారణకు లీటర్కు నీటికి ప్రొపి కోనజోల్ 1 మి.లీ చొప్పున కలిపి పిచికారి చేయాలని సూచించారు