prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:17 pm Digital Edition : PRAJA VANI

కమలాపూర్ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు

కమలాపూర్ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు

ప్రజావాణి అక్టోబర్ 31 కమలాపూర్ మండల్ లో ఇందిరాగాంధీ 42వ వర్ధంతిని నిర్వహించారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ

గరీబ్ హటావో నినాదంతో దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగానికి దక్కుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు

ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా ఆమె దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసి వారి జీవితాలకు భరోసా కల్పించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు
ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు
ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు
పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల ప్రముఖులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు