prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 8:38 pm Digital Edition : PRAJA VANI

కమలాపూర్ పెద్ద చెరువు తూముకు తాళం అక్రమంగా నీరు వదిలితే చర్యలు తప్పవు

కమలాపూర్ పెద్ద చెరువు తూముకు తాళం అక్రమంగా నీరు వదిలితే చర్యలు తప్పవు

ప్రజావాణి అక్టోబర్ 10 కమలాపూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు తు ము నుండి అక్రమంగా నీటిని గుర్తు తెలియని వ్యక్తులు వదులుతున్నారని సమాచారంతో తూమును పరిశీలించిన కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ

కమలాపూర్ పెద్ద చెరువు నీరును సుమారు 16 గ్రామాలకు తాగు సాగు కోసం ఉపయోగిస్తామని అన్నారు ఎల్నివో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడినందున ఎవరైనా అక్రమంగా తూము నుండి నీటిని వదిలితే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు

ఈ దుశ్చార్య వల్ల రాబోయే వేసవి కాలంలో తాగడానికి నీరు దొరకదని చెప్పారు అనంతరం గ్రామస్తుల సహకారంతో తూముకు తాళం వేయించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాగరాజు మల్లారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు