prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:00 pm Digital Edition : PRAJA VANI

కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకునే వరకు పోరాటం ఆపేది లేదంటున్న మహిళా సంఘాలు

కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకునే వరకు పోరాటం ఆపేది లేదంటున్న మహిళా సంఘాలు

* ప్రభుత్వ భూమి కబ్జావీఓ బిల్డింగ్‌కు స్థలం ఏదీ

* అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం

* జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు సంఘాలు

జమ్మికుంట అక్టోబర్ 5 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాజమ్మికుంట మండలం
ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పెద్దంపల్లి గ్రామ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని, ఆ స్థలంలో మహిళా సంఘాల వీఓ బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల సభ్యులు సోమవారం జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.వీఓ బిల్డింగ్ కోసం స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి ఆర్డీఓ కార్యాలయం, ఎం ఆర్ ఓ కార్యాలయం వరకు పలుమార్లు అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు.ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ దానిని కబ్జాదారుల చెర నుంచి విడిపించి మహిళా సంఘాలకు ఉపయోగపడేలా చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో వీఓ బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరాయి.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాలపై మౌనం వహిస్తే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఎక్కడుందని మహిళా సంఘాల సభ్యులు నిలదీశారు. తమ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కార్యాలయాల చుట్టూ తిప్పడం తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో చేరి అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ప్రభుత్వ భూమిని తక్షణమే సర్వే చేసి, కబ్జాను తొలగించి వీఓ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలనికోరారుఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. ప్రభుత్వ భూమి రక్షణలో అధికారులు విఫలమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అవసరమైతే మరింత మందికి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని స్పష్టం చేశారూ