కపిల గిరి క్షేత్రం పైఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ భూమి పూజ
* శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు
* ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ శ్రీమతి ఉమారెడ్డి
* భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు
పరిగి,అక్టోబర్12( ప్రజావాణి):
కులకచర్ల మండల కేంద్రంలోని కపిలగిరి క్షేత్రంపై శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం సోమవారం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. గౌరవ సుంకిరెడ్డి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధార్మిక మహోత్సవంలో పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఉమారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విగ్రహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ (PACS) చైర్మన్ బొలసాని భీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రే భరత్ కుమార్, ఏఎంసీ (AMC) చైర్మన్ బి.ఎస్. ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ వర్వాళ్ళ అంజిలయ్య, సుంకిరెడ్డి నర్సింహారెడ్డి, సుంకిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పి. గోపాల్, దళిత సంఘాల కన్వీనర్ తుప్పలి అశోక్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ, సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, సుంకిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పెట్లోళ్ల సౌమ్య వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు జోగు వెంకటయ్య, బొలసాని శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంజిలయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాస్, తమ్మలి రాంచెంద్రయ్య, చెలిమిళ్ల ఆనందం, నాగని ఎల్లయ్య, శివాని ఎల్లయ్య, కర్రే వినోద్, మోత్కూర్ వెంకటేష్, మోర సత్యమ్మ వెంకటేష్, గంగ్య నాయక్, రవి, లాలు నాయక్, నర్సింహారెడ్డి, బక్కని వెంకటయ్య, తీర్పత్తయ్య, భరత్ రెడ్డి, నాగని వెంకట్రాములు, బైండ్ల రాంచెంద్రయ్య, మడిగా కాడి రాజయ్య, జెట్టిగాళ్ల వెంకటయ్య, దొమ్మ బాబు, నాగని బిచ్చయ్య, నాగని ఆంజనేయులు, ఐలాగారి కృష్ణయ్య, పోతగాళ్ల కృష్ణ, శివాని భీమయ్య, కోస్గి వెంకటయ్య, కోర్డుటి బాను, గణేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.