కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు చీర, సారె సమర్పణ

ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రార్థన రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం పట్టు వస్త్రాల సమర్పణ సమయంలోనూ సాగిన సామాన్యుల దర్శనాలు విజయవాడ,అక్టోబర్ 16ప్రజావాణి ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు అధికారులు,...