కడవెండిలో భక్తిశ్రద్ధలతో చండీ హోమం – నవరాత్రి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ
కడవెండిలో భక్తిశ్రద్ధలతో చండీ హోమం - నవరాత్రి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం చండీ హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. హోమగుండం నుండి వచ్చే పవిత్ర జ్వాలలు, మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా...