ఔషాపూర్ ఉర్సు ఉత్సవాలకు హాజరైన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపిన సందీప్ రెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ ఔషాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉర్సు-ఏ-షరీఫ్ ఉత్సవాలకు హాజరైన ప్రముఖులకు ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల సందీప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దర్గా ముత్తవల్లి మీర్ సర్ఫరాజ్ నవాబ్, ఔషాపూర్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నిసార్ అహ్మద్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామల అమర్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్...