prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 1:26 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఔషాపూర్ ఉర్సు ఉత్సవాలకు హాజరైన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపిన సందీప్ రెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ ఔషాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉర్సు-ఏ-షరీఫ్ ఉత్సవాలకు హాజరైన ప్రముఖులకు ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల సందీప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

దర్గా ముత్తవల్లి మీర్ సర్ఫరాజ్ నవాబ్, ఔషాపూర్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నిసార్ అహ్మద్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామల అమర్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఘట్‌కేసర్ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, మైనారిటీ ముస్లిం నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, నిర్వాహకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆకాంక్షించారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.