ఓ యువతా.. మేలుకో! మత్తు కాదు.. నీ భవితే ముఖ్యం
*ఓ యువతా.. మేలుకో! మత్తు కాదు.. నీ భవితే ముఖ్యం!* రాయికల్; అక్టోబర్ 25(ప్రజావాణి) నేటి యువత చేతిలో పుస్తకాలు ఉండాల్సిన చోట మద్యం సీసాలు, కళ్ళలో కలలు ఉండాల్సిన చోట నిషా కనిపించడం సమాజం ఎంతగా దిగజారిపోయిందో చెబుతోంది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ చేయాలని కలలు కనేవారు, కానీ నేడు పద్దెనిమిదేళ్లు నిండకముందే మద్యం తాగడం, సిగరెట్లు కాల్చడం, రాత్రంతా పబ్బుల్లో జల్సాలు చేయడం, బైకులపై రాష్ డ్రైవింగ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. స్నేహం పేరుతో మొదలైన...