prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:41 pm Digital Edition : PRAJA VANI

ఓరుగంటి సోమనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఓరుగంటి సోమనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్దవంగర అక్టోబర్ 16 ప్రజావాణి
పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కారోబార్ ఓరుగంటి సోమనర్సయ్య ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా సోమనర్సయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, యూత్ & సోషల్ మీడియా నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.