prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 4:52 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మార్కెల్లి ప్రకాష్ పటేల్.

ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మార్కెల్లి ప్రకాష్ పటేల్.నియామక పత్రం అందజేసిన ఎంపీ ధర్మపురి అరవింద్.

పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా.ఓబీసీ మోర్చా జిల్లా నూతన ఉపాధ్యక్షుడు ప్రకాష్ పటేల్.

పార్టీలో కీలక పదవి సాధించిన ప్రకాష్ పటేల్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.ఈ మేరకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా నూతన ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.నాపై నమ్మకంతో ఈ బాధ్యత ను అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తు న్నానని అన్నారు.పార్టీ శ్రేయస్సే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తానని,నియోజకవర్గంలోని నాయకులను,కార్యకర్త లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి లోకి తీసుకెళ్లి ప్రజలందరికీ అందేలా నా వంతు బాధ్యత నెరవేరుస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి,జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె రంగారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి వేణుగోపాల్, నియోజకవర్గ ఇన్చార్జి భరత్ రెడ్డిల,ఆయా మండలాల అధ్యక్షులు,మోర్చాల నాయకులు,జిల్లా పదాధికారులు, కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రకాష్ పటేల్‌కు అభినందనలు తెలిపారు.