prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 8:27 am Digital Edition : PRAJA VANI

ఓటు హక్కు పరిరక్షణపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం

ఓటు హక్కు పరిరక్షణపై కాంగ్రెస్ సమీక్ష సమావేశం

‘ఓటు బచావో–దేశ్ బచావో’పై నేతల దిశానిర్దేశం

అర్హులైన ఏ ఒక్కరికీ ఓటు హక్కు దూరం కావొద్దు

ఓటరు జాబితాల్లో తప్పులు సరిచేయాలని సూచన

పటాన్‌చెరు, అక్టోబర్ 27 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పటాన్‌చెరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు సరల్ పటేల్, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సమన్వయకర్తలు నాగరిగారి ప్రీతమ్, గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నేతలు చర్చించారు. జాబితాల్లోని తప్పులు, పొరపాట్లను గుర్తించి సరిచేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడికీ ఓటు హక్కు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి పౌరుడికి ఓటు విలువపై అవగాహన కల్పించాలని నేతలు పిలుపునిచ్చారు. ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణపై చైతన్యం కల్పించాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.