prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 12:24 pm Digital Edition : PRAJA VANI

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

– కదిలిన జనగామ సేవాదళ్

జనగామ జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్ అక్టోబర్ 06 (ప్రజావాణి) ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా, ఓటు చోరీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు జనగామ జిల్లా సేవాదళ్ నుండి భారీ మద్దతు లభించిందని, జనగామ జిల్లా సేవ దళ్ అధ్యక్షులు జాయ మల్లేష్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.

టీపీసీసీ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదేశాల మేరకు, దేశంలో ఓటు చోరీ జరుగుతోందని, ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సిఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

ఈ దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర సేవాదళ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, సోమవారం ఉదయం 10 గంటల వరకు జనగామ జిల్లా నుండి సేవాదళ్ శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు తరలి వెళ్లారు.

జనగామ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జాయ మల్లేష్ గాఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, గ్రామ మరియు వార్డు స్థాయి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, సిఈసి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ గారు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సేవాదళ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జనగామ జిల్లా సేవాదళ్ ఐక్యంగా, క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనగామ జిల్లా సేవాదళ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, భవిష్యత్తులో జరిగే ప్రతి పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.