prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 7:48 am Digital Edition : PRAJA VANI

ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడిన కూకట్‌పల్లి ఆడపడుచులు

ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడిన కూకట్‌పల్లి ఆడపడుచులు!

ఐకమత్యానికి ప్రతీకగా బతుకమ్మ సంబరాలు.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఘనమైన వేడుక

కూకట్‌పల్లి విలేజ్, అక్టోబర్ 13 (ప్రజావాణి):

కూకట్‌పల్లి విలేజ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామానికి చెందిన మహిళలు, ఆడపడుచులు అందరూ ఒకే చోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

కులమతాలకు అతీతంగా మహిళలందరూ ఒకే వేదికపై కలుసుకుని బతుకమ్మ ఆడటం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు సందడి చేయడంతో కూకట్‌పల్లి విలేజ్ అంతా బతుకమ్మ శోభతో కళకళలాడింది.

ఆడపడుచుల ఐకమత్యం.. బతుకమ్మ పండుగ ప్రత్యేకత!