prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:59 pm Digital Edition : PRAJA VANI

ఏసిరెడ్డి సత్తిరెడ్డి మృతి రాంసాగర్ గ్రామానికి తీరని లోటు – మహదేవుని శ్రీనివాస్

ఏసిరెడ్డి సత్తిరెడ్డి మృతి రాంసాగర్ గ్రామానికి తీరని లోటు – మహదేవుని శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం, రాంసాగర్ గ్రామానికి చెందిన ఏసిరెడ్డి సత్తిరెడ్డి మరణించిన విషయం తెలుసుకున్న కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ సోమవారం గ్రామానికి విచ్చేసి, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తిరెడ్డి గారు గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా, కలివిడిగా ఉండేవారని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తన ఆపదగా భావించి ఆర్థికంగా అండగా నిలిచేవారని గుర్తు చేశారు. గ్రామ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి, అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

సత్తిరెడ్డి మరణం వారి కుటుంబ సభ్యులకే కాకుండా, రాంసాగర్ గ్రామ ప్రజలకు కూడా తీరని లోటని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని ఏసిరెడ్డి సత్తిరెడ్డి కి నివాళులర్పించారు.