ఏపీ ఎన్జీవో బద్వేల్ తాలూకా అధ్యక్షునిగా ఆర్. అమర్నాథరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక: బీజేపీ నాయకుల ఘన సన్మానం
బద్వేల్: అక్టోబర్ 1ప్రజావాణి కాశినాయన ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బద్వేల్ తాలూకా నూతన కార్యవర్గ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.బద్వేల్ తాలూకా సంఘ నూతన అధ్యక్షునిగా కాశినాయన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్,గా విధులు నిర్వహిస్తున్న ఆర్.అమర్నాథరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో అమర్నాథరెడ్డి అభ్యర్థిత్వానికి ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపడం విశేషం. ఆయన ఏకగ్రీవ ఎన్నిక పట్ల తాలూకా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు,పలు ప్రజా సంఘాల నాయకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.అమర్నాథరెడ్డి ఎన్నిక బద్వేల్ తాలూకా ఎన్జీవో సంఘానికి...