prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:56 pm Digital Edition : PRAJA VANI

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం జిల్లా (అక్టోబర్ )9.

34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ పిటిషన్‌కు చుక్కెదురైంది.

సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్లు భావిస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. నోటిఫికేషన్‌ను ఈ సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, అది రేపటికి వాయిదా పడే అవకాశమూ ఉందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు నోటిఫికేషన్ సమయంపై ఉత్కంఠ కొనసాగనుంది.