ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి

ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి: ముకుంద నాగేశ్వర్ డిమాండ్ పరిగి:ప్రజావాణి,అక్టోబర్ 26: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నల్గొండ జిల్లాలోని డిండికి నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి చేయడమేనని తెలంగాణ ఉద్యమ నాయకులు, బీజేపీ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జలసాధన సమితి కన్వీనర్ ముకుంద నాగేశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం కేవలం ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమేనని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని ఆయన...