prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:55 pm Digital Edition : PRAJA VANI

ఏటూరునాగారంలో మోకాళ్లపై నిలబడి ఎన్ఎచ్ఏం ఉద్యోగుల వినూత్న నిరసన.

ఏటూరునాగారంలో మోకాళ్లపై నిలబడి ఎన్ఎచ్ఏం ఉద్యోగుల వినూత్న నిరసన.

ఏటూరునాగారం అక్టోబర్ 31 ప్రజావాణి:

​తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ములుగు జిల్లా ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకురాలు సుకన్య ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా తమ నిరసన తెలిపారు.
​ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ… జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో గత 20 సంవత్సరాలుగా 17,000 మందికి పైగా ఉద్యోగులు తీవ్ర శ్రమకోర్చి సేవలు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మెను ఉధృతం చేసినట్లు పేర్కొన్నారు.
​గత ప్రభుత్వాలు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినిలబెట్టుకోలేకపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తారని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నామని తెలిపారు.
​ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:
​ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
​పెరిగిన వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
​మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలి.
​ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు , బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, నర్సింగ్ సిస్టర్స్,లు, సిబ్బంది, సెక్యూరిటీ అండ్ కాంటింజెంట్ వర్కర్లు శ్వేత, స్రవంతి, దివ్య, మమత, మానస, కౌసల్య, నిర్మల, సత్యవతి, దేవరాజ్, కృష్ణ, యశోద, చిన్నన్న, మురళి, సంపత్, వెంకట్, భరత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.