prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 5:00 pm Digital Edition : PRAJA VANI

ఎస్సై కల్తీ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ

ఎస్సై కల్తీ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కల్తీ కిషోర్ కి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలో నెల్లుట్ల గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై ని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి, మండల సర్పంచుల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ. “మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై కల్తీ కిషోర్ నాయకత్వంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం కావాలని కోరుకుంటున్నాము. గ్రామాల్లో నేరాల నియంత్రణ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన, ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాము. మండలంలోని సర్పంచులుగా మేమంతా పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తాము. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్, పంచాయతీ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తే మండలం మరింత అభివృద్ధి చెందుతుంది” అని అన్నారు.

అనంతరం ఎస్సై కల్తీ కిషోర్ మాట్లాడుతూ, సర్పంచుల సహకారంతో మండలంలో నేర రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తానని, ప్రజలందరికీ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు బత్తిని వేణు గౌడ్, గొరిగే సందీప్, నల్ల అజయ్, నల్ల విల్సన్, బొజ్జం సునీత ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ మోటే వీరస్వామి, మాజీ ఉపసర్పంచ్ నర్సింగ ఎల్లస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెగ్గం ఆనంద్, యేనగందుల భాస్కర్, చిట్ల తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.