prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:33 pm Digital Edition : PRAJA VANI

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

కోదాడ అక్టోబర్ 9,ప్రజావాణి : జోనల్ ఇన్చార్జి స్నేహలత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్నేహలత మాట్లాడుతూ బతుకమ్మ అంటే పూల జాతర అని అన్నారు. ప్రపంచంలోనే పువ్వులను దేవతగా కొలిచే సంప్రదాయం తెలంగాణకి పరిమితం అన్నారు. ఆడపడుచులు తమ కష్టసుఖాలను పాటల రూపంలో తెలియజేస్తూ ఆటపాటలతో జరుపుకునే అతి పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. పండగ అంటే అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవడమే అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.