prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:39 pm Digital Edition : PRAJA VANI

ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం

*ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో జారీ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), పోలీస్ కానిస్టేబుల్ (PC) ఉద్యోగ నియామకాలకు సంబంధించి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సి , ఎస్టీ , బిసి , మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జనగామ జిల్లా అధికారి డాక్టర్ విక్రమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక విధానం: స్టడీ సర్కిల్ నిబంధనలు, రిజర్వేషన్ రోస్టర్ / రిజర్వేషన్ నిష్పత్తి, డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు.

దరఖాస్తుతో సమర్పించవలసిన పత్రాలు:
1. SI, PC పోస్టులకు దరఖాస్తు చేసిన అప్లికేషన్ / అక్‌నాలెడ్జ్‌మెంట్ ఫారం
2. SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్, TC
3. కులం, ఆదాయం, రెసిడెన్షియల్, ఆధార్ కార్డు
4. అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలు

పై పత్రాలను షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, RTC కాలనీ, వడ్డేపల్లి, హనుమకొండ నందు సమర్పించాలన్నారు.

దరఖాస్తుల గడువు: 06-10-2026 నుంచి 10-10-2026 సాయంత్రం 5:00 గంటల వరకు.
మరిన్ని వివరాల కోసం స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్ 9160606862 లో సంప్రదించగలరని కోరారు.