ఎస్‌ఐఆర్ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
*మన ప్రజావాణి*
మంచిర్యాల
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లు, ఎన్నికల విభాగం అధికారులతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి, మ్యాపింగ్ కాని ఓటర్లు, అనమలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, వారి ఇండ్లకు వెళ్లి వారి నుంచి ధృవపత్రాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇండ్ల వద్దకు వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలను సేకరించాలని తెలిపారు. ఎ.ఈ.ఆర్.ఓ.లు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని తెలిపారు
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో నోటీసులు జారీ చేయబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇండ్ల వద్ద అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, ఎఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు..