prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 9:00 am Digital Edition : PRAJA VANI

ఎల్ ని నో ప్రభావంతో నీటి, విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన సదస్సు

*ఎల్ ని నో ప్రభావంతో నీటి, విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన సదస్సు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

ఎల్ ని నో ప్రభావం తీసుకోవలసిన జాగ్రత్తల పై సోమవారం చండూరు మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి వేముల పుష్పక్క కళాబృందం ఆటపాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాబోయే రోజుల్లో ఎల్ ని నో కరువు తీవ్ర ప్రభావితం చేయనుందని ఇప్పటినుండే నీటిని విద్యుత్ ను పొదుపుగా వాడుకొని కరువు ని ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని తెలియజేశారు కళాకారులు పాడిన పాటలను గ్రామస్తులు ఆలకించారు ఈ కార్యక్రమంలో కళాకారులు వసంత, నిర్మల, మల్లిక, లతీఫ్, వెంకట్, శేఖర్, సునీత, జానకి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.