prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 10:05 pm Digital Edition : PRAJA VANI

ఎల్-నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

ఎల్-నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి – డిఆర్డిఎ భాస్కర్ సూచన

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 13(ప్రజావాణి): జిల్లా లోని
లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో జరుగుతున్న VB-G-RAM-G (వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ) పనులను డిఆర్డిఎ అధికారి భాస్కర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను, మస్టర్ల నిర్వహణను ఆయన పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా డిఆర్డిఎ భాస్కర్ గారు మాట్లాడుతూ
“వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుచూపుతో వ్యవహరించాలి. ఎప్పటిలాగే వరి పంటలపై మాత్రమే ఆధారపడకుండా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి.

ముఖ్యంగా కూరగాయలు, పప్పుదినుసుల పంటలు సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా కరువు నుండి బయటపడవచ్చు. రైతులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న సూచనలు పాటించాలి” అని సూచించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు రైతులకు, వ్యవసాయానికి ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, ఎంపీడీఓ శివశంకర్, ఈసి సతీష్, టిఏ కనకయ్య, ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్ బొజ్జం సునీత ప్రభాకర్, గ్రామ నాయకులు జెగ్గం అశోక్, ఏనగందుల భాస్కర్, కారోబార్ చెరుకు అజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ నల్ల శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.