prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:00 pm Digital Edition : PRAJA VANI

ఎల్ నినో గండం.. నీటిని పొదుపుగా వాడాలి – భూగర్భ జలాలు అడుగంటితే ప్రమాదం

ఎల్ నినో గండం.. నీటిని పొదుపుగా వాడాలి – భూగర్భ జలాలు అడుగంటితే ప్రమాదం

నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పిలుపు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 26(ప్రజావాణి): ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో గ్రామాల్లో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే వేసవి, పొడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ ఇప్పటి నుంచే నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వర్షపాతం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయని, చెరువులు, బావులు, బోర్లలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులు రానున్న కాలంలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని వరి వంటి నీటి అవసరం ఎక్కువగా ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు పంట నష్టం జరగకుండా ఉంటుందన్నారు.

భూగర్భ జల మట్టాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

“మనం నేడు ఆదా చేసే ప్రతి చుక్క నీరు మన భావితరాల భవిష్యత్తుకు జీవనాధారం. నీటి సంరక్షణ కోసం గ్రామ పంచాయతీ చేపడుతున్న ముందస్తు చర్యలకు ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, ఎఈఓ వినయ్ కుమార్, వార్డు సభ్యులు వేల్పుల శోభారాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, బత్తిని వేణు, గొరిగే సాయిలు, ఏఎన్ఎం అంజమ్మ, ఆశా కార్యకర్తలు, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, హరితహారం చైర్మన్ చిట్ల తిరుమల రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పెరబోయిన కుమార్, గ్రామ రైతులు కొయ్యడ రాంచెట్టయ్య, శ్రీనివాస్, కుర్రేముల రమేష్, లక్ష్మినారాయణ, వంగ చంద్రం, గొరిగే సిద్ధార్థ, మల్లయ్య, పెరబోయిన మధు తదితరులు పాల్గొన్నారు.