ఎల్లంపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఎల్లంపేట(ప్రజావాణి):- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింసా మార్గాలు సమాజానికి ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గూడూరు విజయలక్ష్మి, 7వ వార్డు కౌన్సిలర్ బందెల కుమార్, మున్సిపల్ సెక్రటరీ అపర్ణ, సీనియర్ నాయకులు హరిబాబు రెడ్డి, కుమ్మరి జహంగీర్, నాగరాజుచారి, చుక్క సత్యనారాయణ, మామిళ్ల మహేందర్ యాదవ్, బందెల స్వామి, మున్వర్ అలీ, హర్షత్ అలీ, చుక్క శంకర్, జీడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.