ఎల్ఐజీ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ….ముఖ్య అతిథులుగా బద్దం నర్సింహారెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి):ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకలకు పోచారం డివిజన్ జనరల్ సెక్రటరీ బద్దం నర్సింహారెడ్డి, పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ సంబరాల్లో...