prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 12:12 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఎల్ఐజీ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ….ముఖ్య అతిథులుగా బద్దం నర్సింహారెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

 

ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి):ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ వేడుకలకు పోచారం డివిజన్ జనరల్ సెక్రటరీ బద్దం నర్సింహారెడ్డి, పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు నిదర్శనమని తెలిపారు. కాలనీవాసులు కలిసికట్టుగా సంప్రదాయ పండుగలను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేడుక అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు రామాంజనేయులు, సురేష్, పురుషోత్తం రెడ్డి, సురేష్ కాంబ్లే, మహేందర్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, మందడి కృష్ణ, రమేష్‌తో పాటు మహిళలు జాబిన్ సుల్తానా, బెల్లం మీనా, గాదె నాగరాణి గౌడ్, మందడి పద్మ, మణెమ్మ, పద్మ, మంజుల, సరిత, అంజలి, శ్రీలత, పావని తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.