prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:53 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్సీ ఓటరుగా పట్టభద్రులు నమోదు చేసుకోవాలి

ఎమ్మెల్సీ ఓటరుగా పట్టభద్రులు నమోదు చేసుకోవాలి………..
నాగర్ కర్నూల్ జిల్లా…

కల్వకుర్తి నియోజకవర్గం :
(ప్రజావాణి ప్రతినిధి)
అక్టోబర్ 06: వెల్దండ మండలంలోని డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులు ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ కార్తీక్ కుమార్ కోరారు. మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధిలో ఇప్పటికే 780 మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదై ఉన్నారని తెలిపారు.
అక్టోబర్ 2023 వరకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అర్హులైన యువతీ యువకులు కొత్తగా పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం గెజిటెడ్ అధికారి ధృవీకరించిన విద్యార్హత పత్రాలను సమర్పించి ఆన్‌లైన్‌లో లేదా మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అర్హులైన పట్టభద్రులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని తహసీల్దార్ కార్తీక్ కుమార్ కోరారు.