prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 10:17 am Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్సీ ఎన్నికల – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ల నియామకం

ఎమ్మెల్సీ ఎన్నికల – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ల నియామకం

జనగామ జిల్లా ప్రతినిధి, జె. ఉపేందర్, అక్టోబర్ 19 (ప్రజావాణి): రాబోయే ఖమ్మం-వరంగల్-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇచ్చిన సూచనలు, ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల నిర్వహణ, సమన్వయ బాధ్యతల కోసం కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లను సోమవారం నియమించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య తెలిపారు.

పార్టీ కోసం నిత్యం కృషి చేస్తూ, పట్టభద్రులలో మంచి పట్టు ఉన్న నాయకులను ఈ బాధ్యతలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.

నియమితులైన వారు:

నియోజకవర్గ స్థాయి ప్రధాన కోఆర్డినేటర్ గా :

సదం మనోహర్

అసిస్టెంట్ కోఆర్డినేటర్లుగా :
బస్వాగని అనిల్ గౌడ్, నర్సింగ రమేష్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన కోఆర్డినేటర్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.