prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 7:00 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి:
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
ప్రజావాణి,ఇనుగుర్తి:వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు కిషన్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి హాజరై శంకర్ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వ హయాంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న అర్హులైన ప్రతి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకునేలా చూడాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గ్రామాల వారీగా విద్యావంతులను గుర్తించి, ఫారం-18 ద్వారా దరఖాస్తులను పూర్తి చేయించడంలో సహాయపడాలని ఆదేశించారు.
​అంతేకాకుండా, మండల పరిధిలో నమోదైన ఓటర్ల పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పార్టీ ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేయాలని, ఈ ప్రక్రియలో మండల, గ్రామ స్థాయి నాయకులు సమన్వయంతో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పట్టభద్రుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనని, ఈ ఎన్నికల్లో ప్రతి గ్రాడ్యుయేట్ మద్దతు కూడగట్టేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
​ఈ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు అఖిల్, స్థానిక ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి,దీకొండ వెంకన్న, దార్ల రామ్మూర్తి, బేతమల్ల చంద్రయ్య, వేముల శ్రీనివాస్, గడ్డం శ్రీకాంత్, పెండ్లి మహేందర్,చెట్టబోయిన క్రాంతిలతో పాటు మండల, గ్రామ శాఖల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.