prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:20 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కావేటి అశోక్ దంపతులు

*ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కావేటి అశోక్ దంపతులు*

*ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ముందుంటా: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి*

మంచాల, అక్టోబర్ 17 (ప్రజావాణి): మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాద్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కావేటి అశోక్, ఆయన సతీమణి లక్ష్మి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా వారి ముందుంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత అని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దాద్‌పల్లి గ్రామ అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమైనా మంజూరు చేయించేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన కావేటి అశోక్ దంపతులు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వాటిని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఎలా ఉంటుందో తన పనితీరు ద్వారా చూపిస్తున్న చురుకైన నాయకుడు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అని కొనియాడారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు .