ఎఫ్‌ఎస్‌సీఎస్‌ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఘట్‌కేసర్, అక్టోబర్ 16 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని బుగ్గనగర్‌లో ఉన్న ఎఫ్‌ఎస్‌సీఎస్‌ కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ మహిళలు సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేడుకలతో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.