prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 6:33 pm Digital Edition : PRAJA VANI

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

*ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి…*

*అడిషనల్ కలెక్టర్ కు డిఎంహెచ్ఓ లకు వినతి పత్రాలు అందజేత.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08*

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈనెల 13న నిర్వహించనున్న సమ్మెకు సంబంధించిన నోటీసును యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్లకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు తమకు ఎదురవుతున్న సమస్య లను అధికారుల దృష్టికి తీసుకెళ్లి , వాటిని తక్షణ మే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అధికారులు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు ఉద్యోగ నాయకులు తెలిపారు.
ఎన్ ఎచ్ యం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి , వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని , ఉద్యో గుల సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈనెల 13న సమ్మెను నిర్వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగు లకు మద్దతుగా టీఎన్జీవో నాయకులు వెంకట్ రెడ్డి , ఐఎన్టియుసి నాయకులు ఎండీ జమాల్ , ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసో సియేషన్ ఉద్యోగ నాయకులు కార్యక్రమానికి హాజరై తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు డాక్టర్ షాహిద్ అలీ , నెహ్రు , నర్సింహా , శ్రీనివాస్ , మురళి , వినోద్ , లావణ్య , గీత , భవాని , సుమలత తదితరులు పాల్గొన్నారు.