ఎన్ ఎన్ పాలెంలోకార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన ఎస్ ఐ ఎల్ రామకృష్ణ
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 16
దొనకొండమండలంలోని ఎన్ ఎన్ పాలెం గ్రామాలలో ఎస్ సి కాలనీ లో ఎస్ఐ ఎల్. రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లను ఇంటింటికీ తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ నిల్వలు, వినియోగం తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించారు. 20 ద్విచక్ర వాహనాల నాలా ధ్రువపత్రాలను పరిశీలించారు .
ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్. రామకృష్ణ మాట్లాడుతూ, అనుమానాస్పద వ్యక్తులకు అక్రమంగా ఆశ్రయం కల్పించడం, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, నిషేధిత లేదా ప్రమాదకరమైన ఆయుధాలను అక్రమంగా కలిగి ఉండటం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కురిచేడు ఎస్ ఐ రామకోటయ్య మాట్లాడుతూ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో కురిచేడు ఏ ఎస్ ఐ మురళి తదితరులు పాల్గొన్నారు.